ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా అధికార టీడీపీ నేతల బరితెగింపు తగ్గడం లేదు. గురువారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ తన కారుపై పచ్చజెండా పెట్టుకుని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పార్క్ చేయడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత పాతకోట బంగారు మునిరెడ్డి సోషల్ మీడియాలో సాక్ష్యాలతో సహా నిలదీశారు. శ్రీఇది మున్సిపల్ కార్యాలయమా లేక టీడీపీ ఆఫీసా?్ఙ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం వైరల్ కావడంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ స్పందిస్తూ.. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. కోడ్ ఉల్లంఘిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


