కడపలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన! | - | Sakshi
Sakshi News home page

కడపలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన!

Oct 16 2026 7:17 AM | Updated on Oct 16 2026 7:17 AM

చాపాడులో ..

చాపాడులో ..

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే నిబంధనల ప్రకారం రాజకీయ నేతల ఫ్లెక్సీలు, ప్రభుత్వ ప్రచార బోర్డులను అధికారులు తొలగించాలి. కానీ, కడప నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రాలతో కూడిన హోర్డింగులు నేటికీ దర్శనమిస్తున్నాయి. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై నగరవాసులు మండిపడుతున్నారు. వీటికి ఎన్నికల కోడ్‌ వర్తించదా?! అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి వీటిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

– సాక్షి ఫోటోగ్రాఫర్‌, కడప

చాపాడు : మండల కేంద్రమైన చాపాడులో అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ఉపాధి హామీ పథకం కింద రూ.4లక్షలతో సిమెంటు రోడ్డు మంజూరైంది. అయితే పనులు ప్రారంభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణ మేరకు ఎన్నికల కోడ్‌ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఎలాంటి ప్రభుత్వ పరమైన అభివృద్ధి పనులు చేపట్టరాదు. అయినప్పటికి గురువారం సెమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికి వస్తుంది. మండల పరిషత్‌, మండల రెవెన్యూ కార్యాయాల సమీపంలో పీహెచ్‌సీలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి పనులు చేపట్టడం గమనార్హం.

పీహెచ్‌సీలో రూ.4లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement