●120కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
కడపకార్పొరేషన్: కడప నగరం రామాంజనేయపురంలోని వరద కాలనీలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు గంపా వీరయ్యతోపాటు 120 కుటుంబాలకు చెందిన వారు వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ జెడ్పీ చైర్మెన్ కె. సురేష్ బాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా, కడప నగరం అభివృద్ధి చెందిందంటే దివంగత వైఎస్సార్, వైఎస్ జగన్ వల్లే అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో కడప నగరాభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. గత ఎన్నికల్లో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి టీడీపీ మేనిఫెస్టోతోపాటు సొంతంగా మేనిఫెస్టో ప్రకటించి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని, అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. బుగ్గవంకపై గుర్రాలగడ్డ, లా కాలేజీ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిలను ఆరుమాసాల్లో పూర్తి చ ఏస్తానని చెప్పి ఇంత వరకూ పూర్తి చేయలేదన్నారు. మునిసపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీలో చేరినవారిలో గంపా రాజశేఖర్, సుబ్బయ్య, రమేష్, బబ్లూ, చింటూ, మణికంఠ, శివ, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం నగర అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్(బుజ్జి), తిలక్ నగర్ సుబ్బారెడ్డి, నరేంద్ర, శ్రీకాంత్, మౌలా తదితరులు పాల్గొన్నారు.


