నిబంధనలు ఇలా...
డిపాజిట్ వివరాలు...
కడప సెవెన్‌రోడ్స్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభం కానుంది. జిల్లాలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఆయా రిటర్నింగ్ అధికారులు/అసిస్టెంట్ రిట ర్నింగ్ అధికారుల వద్ద సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 18 చివరి గడువు. నామినేషన్ల కార్యక్రమం సజావుగా, సక్రమంగా సాగేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఉదయం 11 నుంచి
మధ్యాహ్నం 3 గంటల వరకు దాఖలు
అభ్యర్థులు తమ నామినేషన్ పత్రంతోపాటు క్రిమినల్ కేసులు, ఆస్తులు, లయబులిటీస్, విద్యార్హతలకు సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మూడు ఫొటోలు, ఓటరు ఐడీ వివరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారైతే కుల ధ్రువీకరణ పత్రాలు, డిపాజిట్‌కు సంబంధించిన రశీదు, రాజకీయ పార్టీ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ వంటివి సమర్పించాలి.
నామినేషన్ పత్రాలు సమర్పించే సందర్భంలో అభ్యర్థితోపాటు మరో ఇద్దరిని మాత్రమే ఆర్వో కార్యాలయంలోకి అనుమతి ఉంటుంది. అభ్యర్థి ఏదైనా కారణాల వల్ల వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతే వారి తరఫున ఒక ప్రతిపాదకుడు, మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. నాలుగుసెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ప్రతి నామినేషన్ పత్రంపై ప్రతిపాదకుని సంతకం, అభ్యర్థి సంతకంతోకూడిన డిక్లరేషన్ ఉండాలి. అభ్యర్థి మున్సిపల్ పరిధిలోని ఏదో ఒక వార్డులో ఓటరై ఉండాలి. 21 ఏళ్లు నిండి ఉండాలి. అభ్యర్థి ఏ వార్డులో నుంచైనా పోటీ చేసేందుకు అర్హులు. అయితే బలపరిచే వ్యక్తి మాత్రం అభ్యర్థి పోటీ చేసే వార్డులో విధిగా ఓటరై ఉండాలి. నామినేషన్లు సమర్పించే ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల అవతల వరకే వాహనాలను అనుమతిస్తారు.
వార్డు పదవికి, మేయర్ పదవికి ఒకే అభ్యర్థి పోటీ చేయాలనుకుంటే రెండింటికి వేర్వేరుగా డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. నగర పాలక సంస్థ మేయర్/వార్డు మెంబర్‌గా పోటీ చేసే అభ్యర్థులు రూ. 5 వేలు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 2500 మాత్రమే చెల్లించాలి.
స్పెషల్ నోడల్ అధికారుల నియామకం
అర్బన్ లోకల్ బాడీ అధికారి పేరు హోదా మొబైల్ నెం.
కడప కార్పొరేషన్ డాక్టర్ నిధి మీనా జేసీ 98499 04119
రాజంపేట హెచ్ఎస్ భావన సబ్ కలెక్టర్ 94907 07882
బద్వేలు ఎ.చంద్రమోహన్ ఆర్డీఓ 98499 04125
కమలాపురం ఎస్.నీలమయ్య ఎఫ్ఎస్ఓ 94408 61943
పులివెందుల జి.చిన్నయ్య ఆర్డీఓ 98499 04111
జమ్మలమడుగు జె.శిరీష ఆర్డీఓ 98499 04115
ప్రొద్దుటూరు వి.వెంకటపతి ఎస్డీసీ 95737 17775
మైదుకూరు ఆదిశేషారెడ్డి పీడీ డ్వామా 79891 71788
ఎర్రగుంట్ల కె.మధుసూదన్‌రావు ఎస్డీసీ 70939 30111


