కూటమికి ఖాకీ సరెండర్‌ ! | - | Sakshi
Sakshi News home page

కూటమికి ఖాకీ సరెండర్‌ !

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

వైఎస్సార్‌ సీపీ నేతలపై బైండోవర్‌... ●పీడీ యాక్టు కేసులు నమోదుకు సన్నాహాలు

వైఎస్సార్‌ సీపీ నేతలపై బైండోవర్‌...

● పులివెందుల నియోజకవర్గంలో

వైఎస్సార్‌సీపీ కీలక నేతలే టార్గెట్‌

● ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి ఒత్తిడికి

తలాడిస్తున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, కడప: రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వం హామీల అమలులో దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన అధికార టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసు బలాన్నే నమ్ముకుంది. అధికార ఒత్తిడికి ఖాకీ కూడా సరెండర్‌ అయింది. అధికార పక్షం ఆదేశించిందే తడువుగా తలాడిస్తూ పోలీసులు కూటమి నేతలకు బైండోవర్‌ అయ్యారు. పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా క్రియాశీలక వైఎస్సార్సీపీ నేతల్ని టార్గెట్‌ చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈమారు క్రియాశీలక నేతలపై పీడీ యాక్టు అమలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో వ్యవస్థలను అడ్డుపెట్టుకొని లబ్ధిపొందాలనే దిశగా అధికార పక్షం అడుగులు వేస్తోంది.

● స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో పులివెందులలో క్రియాశీలక నాయకుల్ని బైండోవర్‌ చేయిస్తున్నారు. సమదృష్టితో చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ నేతల్ని టార్గెట్‌ చేస్తున్నారు. పోలింగ్‌ రోజు వైఎస్సార్‌సీపీ నేతలు కానరాకుండా చేసేందుకు తెలుగు తమ్ముళ్లు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. అందుకు వత్తాసుగా కొంతమంది పోలీసు అధికారులు నిలుస్తున్నారు. ఇంకేముంది పోలీసు రికార్డుల్లోనే ఎటువంటి కేసూ లేని వ్య క్తులను కూడా స్టేషన్లకు పిలిచి వేధింపుల పర్వం మొ దలు పెట్టారు. బైండోవర్‌ కేసులు నమోదు అయిన వ్యక్తులు పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చునేందుకు అభ్యంతరం పెట్టడమే ప్రధాన లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రజల్లోకి వెళ్లి, ప్రజలను మెప్పించి, ఒప్పించడానికి చేతకాక టీడీపీ ఇలాంటి అక్రమ మార్గాలను ఎంచుకుని పావులు కదుపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పచ్చనేతల కుతంత్రం...

శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వ్యక్తులు, తరచూ నేరాలకు పాల్పడతారని భావించే వ్యక్తులు, దొంగతనాలకు పాల్పడేవారు, అల్లర్లు సృష్టించే వ్యక్తులపై పీడియాక్టు (ముందస్తు నిర్బంధం) అమలు చేయాల్సి ఉంది. ఆ ముసుగులో వైఎస్సార్‌సీపీ నేతల్ని పీడీ యాక్టు ద్వారా జైలుకు పంపించే ఎత్తుగడను టీడీపీ ఎంచుకోవడం.. పోలీసులు అమలు చేస్తుండడంపై ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ నేరాలకు పాల్పడి, బెయిల్‌ లభించే కేసులల్లో నిందితులుగా ఉన్నవారిపై పీడీయాక్టు అమలు చేయరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉంది. అయినప్పటికీ అవేవి పట్టించుకోకుండా పచ్చనేతల కుతంత్రాన్ని పోలీసులు అమలు చేస్తుండడం గమనార్హం.

పులివెందుల మున్సిపాలిటీ కేంద్రంగా పీడీయాక్టు కేసులు పెట్టేందుకు పోలీసుల సన్నాహాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే దాదాపు 70మంది నేతల పేర్లతో కూడిన లిస్టును టీడీపీ నేతలు అందించినట్లు సమాచారం. వారందరిపై వివిధ కేసులు నమోదు చేయడం, టార్గెట్‌ చేసిన కొంతమందిపై పీడీయాక్టు అమలు చేయాల్సిందిగా పచ్చనేతల నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఆమేరకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ పార్నపల్లె కిశోర్‌పై పీడీ యాక్టు అమలు చేసినట్లు తెలుస్తోంది. ఆమేరకు బుధవారం అర్ధరాత్రి తర్వాత కిశోర్‌ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓ కేసులో మాట్లాడాల్సి ఉందని, మీ కుమారుడెక్కడంటూ కిశోర్‌ తండ్రిని పలువిధాలుగా ప్రశ్నించారు. ‘అర్ధరాత్రి తర్వాత ఇంటికి రావాల్సినంత నేరమేమి చేశాడు? ఎందుకు ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు? మావాణ్ణి ఏమి చేయాలనుకుంటున్నారంటూ’ ఎదురు ప్రశ్నించడంతో కొద్ది సమయం తర్వాత అక్కడి నుంచి పోలీసులు జారుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement