అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

ఎర్రగుంట్ల: తనపై దొంగతనం నింద వేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎర్రగుంట్ల పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని న్యూకాలనీ రైల్వేస్టేషన్‌ సమీపంలో హనుమనుగుత్తి రాము (37) అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఇతనికి భార్య రాజ్యలక్ష్మి, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇటీవల అదే కాలనీలో నివసించే నాగమణి అనే మహిళ ఇంట్లో బంగారు నగలు కనిపించకుండా పోయాయి. కాగా, ఆ నగలు ఆ తర్వాత సమీపంలోని నాప రాయి బండల వద్ద లభ్యమయ్యాయి. అయితే, ఈ దొంగత నం రామునే చేశాడంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశా రు. సమాజంలో తనకు జరిగిన ఈ అవమానాన్ని రాము భరి ంచలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను.. బుధవారం ఎర్రగుంట్ల ఆర్‌పీఎఫ్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఓ చె ట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచా రం అందుకున్న ఎర్రగుంట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమో దు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ నాగమురళి తెలిపారు.

వేతన పరిమితి రూ. 25 వేలకు పెంపు

– రీజనల్‌ కమిషనర్‌ రవితేజ కుమార్‌ రెడ్డి

కడప ఎడ్యుకేషన్‌: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆపీస్‌ (ఈపీఎఫ్‌ఓ) తప్పనిసరి కవరేజ్‌ గరిష్ఠ వేతన పరిమితిని నెలకు రూ. 15 వేల నుండి రూ. 25 వేలకు పెంచినట్లు రీజనల్‌ పీఎఫ్‌ కమిషనర్‌–1 రవితేజ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ సవరించిన నిబంధనలు సెప్టెంబర్‌ 17 నుంచి అమల్లోకి వచ్చాయన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా అదనంగా 51 లక్షల మంది ఉద్యోగులకు ఈపీఎఫ్‌, ఈపీఎస్‌, ఈడీఎల్‌ఐ సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుతాయన్నారు.

యాజమాన్యాలు చేయాల్సినవి:

ఉద్యోగుల రికార్డులను సమీక్షించి అర్హత ఉన్న వారిని గుర్తించి పీఎఫ్‌ పరిధిలోకి తేవాలి.ఉద్యోగుల యూఏఎన్‌, ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ వివరాలను ఈసీఆర్‌ పోర్టల్‌లో నమోదు చేయాలి. పీఎఫ్‌ చందాలను సకాలంలో చెల్లించాలి. కొత్త నిబంధనల నేపథ్యంలో సెప్టెంబర్‌ నెల చందాల జమ గడువును అక్టోబర్‌ 31 వరకు పొడిగించారు. నిర్దేశిత నిబంధనల ప్రకారం అర్హులు పీఎంబీఆర్‌వై ప్రయోజనాలు కూడా పొందవచ్చని, యాజమాన్యాలు ఈ మార్పులను తప్పక పాటించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement