– నేటి నుంచి కోర్టు విధుల బహిష్కరణ
కడప అర్బన్: న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా కోర్టులో ఈ నెల 15, 16 తేదీల్లో విధులను బహిష్కరించనున్నట్లు కడప బార్ అసోసియేషనన్ అధ్యక్షుడు జి.వి.రాఘవరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.బుధవారం కడప బార్ అసోసియేషన్‌న్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారి రక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చట్టం లేకపోవడం విచారకరమన్నారు. ఇటీవల న్యాయవాదులపై పోలీసుల దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి, దాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 16న శుక్రవారం న్యాయవాదులు కడప కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.


