రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : స్కూల్‌ గేమ్స్‌ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ జట్టును ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎప్‌ జిల్లా సెక్రటరీలు విజయలక్ష్మీ, నాగరాజారెడ్డి తెలిపారు. జాతీయస్థాయి పోటీలలో పాల్గొనే రాష్ట్ర జట్టులో మొత్తం ఐదు మంది క్రీడాకారులు ఎంపిక చేశామన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ రంగస్వామి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ స్థాయి పోటీలలో కూడా రాణించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని క్రీడాకారులను కోరారు. అనంతరం రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించిన బాలబాలికలకు ట్రోఫీలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తరాజుపల్లి హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి పీఈటీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌ కిరణ్‌, అబ్జర్వర్‌ రవి ప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులు వీరే..

బాలుర జట్టు : మహేందర్‌ రెడ్డి (నెల్లూరు), హర్షిత్‌ వెంకట సాయి (అనంతపురం), శ్రీరామ్‌ కార్తీక్‌ (కృష్ణాజిల్లా), త్రిషల్‌ రెడ్డి (కడప), గౌతంరెడ్డి (కృష్ణాజిల్లా). స్టాండ్‌ బై: యాసిర్‌ అహ్మద్‌ (పశ్చిమగోదావరి), గీతేశ్వర్‌ (తూర్పుగోదావరి), ముకుంద్‌ (కష్ణాజిల్లా) నిలిచారు.

బాలికల జట్టు : కావ్య శ్రీరామ్‌ (కృష్ణాజిల్లా), వెంకట లతా రెడ్డి (నెల్లూరు), ఆశాశ్రీ (ప్రకాశం), షేక్‌ ముస్ఖాన్‌ (అనంతపురం), మహిన్‌ చసీన్‌ (కర్నూల్‌), స్టాండ్‌ బై : దేవాన్షి మరియు సతికిక (విశాఖపట్నం). రష్మిక (పశ్చిమగోదావరి) నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement