కడప మేయర్ స్థానం ‘ఓసీ మహిళ’ రిజర్వేషన్ ఖరారు కాగానే, గత ఎన్నికలల్లో టీడీపీ నుంచి ఏకై క కార్పొరేటర్‌గా ఎన్నికై న జి. ఉమాదేవి పేరు తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే శిబిరం అగ్గిమీద గుగ్గిళం అవుతోంది. ఇప్పటికే ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి టీడీపీనే కాదంటూ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి ఆరోపించారు. అసలు రిజర్వేషన్ ప్రక్రియలోనే దెబ్బ కొట్టాలనే దిశగా ఎమ్మెల్యే అడుగులు వేశారు. ఎస్సీకి రిజర్వు కావాలని విశేషంగా కృషి చేశారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అలా సాధ్యం కాకపోవడంతో ఓసీ మహిళ అభ్యర్థిగా ఓ డాక్టర్ పేరు, మరో దంతవైద్యుడు సతీమణీ పేరు, ఇంకో అనుచరుడి సతీమణి పేరు తెరపైకి తెచ్చారు. ఆ ప్రతిపాదనలు ప్రాధాన్యత లభించకపోవడంతో ఏకంగా ‘మా కుటుంబం నుంచే పోటీలో ఉంటా’మని తెగేసి చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ అధిష్టానం నుంచి సానుకూలత లభించకపోవడంతో ఇన్‌ఛార్జి మంత్రి సవిత ద్వారా సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది.గడిచిన రెండేళ్లుగా కొనసాగిన ఏకపక్ష చర్యలన్నీ ప్రస్తు తం మేయర్ సీటుకు ప్రతిబంధకంగా మారినట్లు విశ్వసనీయంగా సమాచారం. ఈ నేపథ్యంలో ఐవీఆర్ఎస్ ఫోన్‌కాల్స్ ద్వారా తెలుగుతమ్ముళ్ల అభిప్రాయం సేకరించి అభ్యర్థి ఎంపిక చేసే దిశగా టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.


