జమ్మలమడుగు మున్సిపాలిటీ ఓసీ మహిళకు రిజర్వుడు అయ్యింది. వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరాను పోటీలో దించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కూటమి అభ్యర్థిగా తన సతీమణి అరుణను పోటీ చేయించేందుకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి ‘ఎమ్మెల్యేగా మీకు అవకాశం దక్కింది. మున్సిపల్ చైర్మన్‌గా నా సతీమణి జ్యోతికి అవకాశం కల్పించా’లని కోరుతున్నట్లు తెలుస్తోంది. ‘2004లో తండ్రి నారాయణరెడ్డి రాజకీయ జీవితానికి అడ్డుతగిలావు. 2024లో నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నావు. ఇప్పుడు మున్సిపాలిటీకి అడ్డుతలుగుతున్నావని’ ఎమ్మెల్యే ఆదిపై భూపేష్ మండిపడుతున్నట్లు సమాచారం.


