ఆగని గ్రావెల్‌ అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

ఆగని గ్రావెల్‌ అక్రమ రవాణా

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : చింతకొమ్మదిన్నె మండలం కొలుములపల్లె గుట్టల నుంచి హిటాచీలతో టిప్పర్లకు గ్రావెల్‌ను యథేచ్ఛగా లోడింగ్‌ చేసుకుంటూ అమ్ముకుంటున్నారు. ఈ అక్రమ దందాలపై పత్రికల్లో వార్తలు ప్రచురితమవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు చెర్చించుకుంటున్నారు. జాతీయ రహదారులపై దర్జాగా గ్రావెల్‌ రవాణా జరుగుతుండటం, ప్రభుత్వ వ్యవస్థలు మౌనం వహించడం కూటమి ప్రభుత్వంలోనే చెల్లుతోందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కారు ధ్వంసం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కడప నగరంలోని నకాష్‌ ప్రాంతంలో పార్కింగ్‌ చేసిన కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కారు యజమాని రియాజ్‌ కడప టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియాజ్‌ సోమవారం రాత్రి తన ఇంటి సమీపంలోని ప్రాంతంలో కారును పార్కింగ్‌ చేశారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు కారును ధ్వంసం చేయడంతోపాటు అద్దాలను పగులగొట్టినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన రియాజ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలించాల్సి ఉంది.

భవానీపురం(విజయవాడపశ్చిమ): శ్రీరాం ఫైనాన్స్‌ సంస్థలో బ్రాంచ్‌ మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా సోమిరెడ్డిపల్లె పంచాయతీ, బ్రహ్మంగారి మఠం మండలం కొంతువారిపల్లె గ్రామానికి చెందిన జేష్టాది చెడ్రాయుడు(30) పోరుమామిళ్ల మండల కేంద్రంలోగల శ్రీరాం ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థ వెహికల్‌ ఫైనాన్స్‌ సెక్షన్‌ బ్రాంచి మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌ నెల 18న ఆఫీస్‌లో ఉండగా ఫిట్స్‌ రాగా కడపలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 12, 13 తేదీలలో భవానీపురంలో సంస్థ ఏర్పాటు చేసిన ట్రైనింగ్‌కు 11వ తేదీ పోరుమామిళ్ల నుంచి వచ్చి భవానీపురంలోని ఆలివ్‌ ట్రీ హోటల్‌లో బస చేశారు. మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఆయన చనిపోయినట్లు చెడ్రాయుడు సోదరుడు నవీన్‌ కుమార్‌కు సంస్థ సమాచారం ఇచ్చింది. మృతుడి తమ్ముడు నవీన్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement