పీజీఆర్‌ఎస్‌ అర్జీలకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌ అర్జీలకు సత్వర పరిష్కారం

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారం నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంపొందించేలా ఉండాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సభాభవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో జేసీ నిధి మీనాతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించి, వీటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంలో పెండెన్సీపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే జాప్యానికి తావులేకుండా తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అలా పరిష్కరించినప్పుడే ప్రజల్లో అర్జీల పరిష్కారంపై నమ్మకం కలుగుతుందన్నారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజల్లో పీజీఆర్‌ఎస్‌ ద్వారా పరిష్కరించిన ఫిర్యాదులపై ప్రజల అభిప్రాయం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూఆర్‌ కోడ్‌లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. డీఆర్వో మల్లికార్జునుడు, జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్లు రంగస్వామి, జాన్‌ ఇర్విన్‌, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జిల్లా సహకార శాఖాధికారి వెంకట సుబ్బయ్య, జిల్లా ఉపాది కల్పనాధికారి సురేష్‌ కుమార్‌, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement