భవన నిర్మాణపనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణపనుల పరిశీలన

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

మైదుకూరు : పాలిటెక్నిక్‌ కాలేజీ విద్యార్థులకు ఈనెలాఖరు నాటికి వసతి కల్పించాలని.. ఈ మేరకు నూతన భవనాలను త్వరగా పూర్తి చేయాలని డీఈఓ షంషుద్దీన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నాడు–నేడు రెండో విడత నిధులు రూ.39లక్షలు మిగలడంతో ఆ నిధులతో పాలిటెక్నిక్‌ విద్యార్థుల కోసం భవన నిర్మాణాలు చేపట్టారు. ఈ మేరకు పాలిటెక్నిక్‌ కళాశాల కోసం స్థానిక జెడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌లో నిర్మాణం జరుగుతున్న భవనాలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఏపీ రవీంద్రతో మాట్లాడి పలు సూచనలు చేశారు. గర్ల్స్‌ హైస్కూల్‌ పిల్లలకు రాగి జావ సక్రమంగా పెట్టడం లేదని వచ్చిన ఆరోపణలపై పూర్వ వంట ఏజెన్సీ నిర్వాహకురాలు లక్ష్మీదేవిని డీఈఓ విచారించారు. అనారోగ్యంతో ఒక రోజు బాయ్స్‌ హైస్కూల్‌లో తయారు చేయించి పిల్లలకు పెట్టినట్టు ఆమె వివరణ ఇచ్చారు. డీఈఓ వెంట డిప్యూటీ డీఈఓ రాజగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ ఏఈ నిరంజన్‌ రెడ్డి, ఎంఈఓ పద్మలత తదితరులు ఉన్నారు.

విద్యార్థికి అభినందన..

ఢిల్లీలో జరిగిన అఖిల భారత సైనిక్‌ శిక్షణలో షూటింగ్‌ పోటీల్లో వెండి పతకం సాధించిన బాయ్స్‌ హైస్కూల్‌ ఎన్‌సీసీ విద్యార్థి హసన్‌ బాషాతో పాటు అతని తల్లిదండ్రులను డీఈఓ షంషుద్దీన్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement