జాతర జనసంద్రం | - | Sakshi
Sakshi News home page

జాతర జనసంద్రం

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

ముగిసిన రాజనాలబండ తిరుణాల

ఆకట్టుకున్న ఉట్లోత్సవం

దేవరెద్దుల సందడి

కోలాటం గమ్మత్తుగా సాగుతుండగా.. చెక్కభజన కళాకారులు లయబద్ధంగా ఆడుతుండగా.. ఉత్సవమూర్తై అమ్మవారు కరుణించారు....కత్తిసాము విన్యాసాలు హోరెత్తగా.. పిల్లనగ్రోవుల గానామృతం మృదుమధురంగా వినిపించగా... బండారు పంపకం అంగరంగ వైభవంగా సాగింది.. సాంప్రదాయ మేళతాళాలకు దేవరెద్దుల అడుగు శబ్దాలు తోడై ఆ ప్రాంతం ఆధ్యాత్మికతతో నిండిపోయింది.. ఘనంగా సాగిన ఉట్లోత్సవానికి.. పోకమాను ఎక్కేందుకు యువత చూపిన ఉత్సాహానికి రాజనాల బండ వేదికై ంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కచోట గుమిగూడగా జాతర జనసంద్రమైంది. అన్నమయ్య జిల్లాలో సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద తిరుణాల మహోత్సవం ఆదివారం కన్నులపండువగా ముగిసింది. – చౌడేపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement