క్షమా గుణాన్ని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

క్షమా గుణాన్ని అలవర్చుకోవాలి

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

కడప సిటీ : తప్పు చేసిన వారిని క్షమించి వారు మంచి మార్గములో నడిపించమని ప్రభువును వేడుకునేలా ప్రతి ఒక్కరూ క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలని రెవరెండ్‌ ఫాదర్‌ జోసెఫ్‌ సూచించారు. కడప నగరంలోని ఆరోగ్యమాత చర్చిలో తిరునాల ఉత్సవంలో భాగంగా తొమ్మిదవరోజు ఆదివారం తేరును అలంకరించి పుణ్యక్షేత్ర ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు నిర్వహించారు. తొలుత ఫాదర్‌ జోసెఫ్‌ దివ్యబలి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్‌ ఫాదర్‌ జోసెఫ్‌ మాట్లాడుతూ తమ పట్ల తప్పు చేసిన వ్యక్తికి ప్రేమతో తన తప్పును తెలియచేసి క్షమించడంతోపాటు సన్మార్గంలో నడిచేలా ఏసు ప్రభువును వేడుకోవాలన్నారు. పరిశుద్ధ పౌలు గారు చెప్పినట్లుగా నిజమైన ప్రేమ ఉన్న చోట పగ ఉండదని, పగ ఉన్న చోట ప్రేమ ఉండదన్నారు. ఈ విషయములో మరియతల్లి మన అందరికీ మార్గదర్శకురాలన్నారు. కార్యక్రమంలో పుణ్యక్షేత్రం డైరెక్టర్‌ రెవరెండ్‌ ఫాదర్‌ ఎల్‌.ఆరోగ్యస్వామి, గురువులు, కన్యసీ్త్రలు, తిరునాల కమిటీ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement