30న బేస్‌బాల్‌ జట్ల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

30న బేస్‌బాల్‌ జట్ల ఎంపికలు

Aug 27 2026 1:24 AM | Updated on Aug 27 2026 1:24 AM

పులివెందుల టౌన్‌ : పట్టణంలోని స్థానిక శ్రీకృష్ణుడి ఆలయం ఎదురుగా ఉన్న ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఈనెల 30వ తేదీన ఉదయం రాష్ట్రస్థాయి సీనియర్‌ బేస్‌బాల్‌ మెన్స్‌, ఉమెన్స్‌ జట్ల ఎంపికలు ఉంటాయని బేస్‌బాల్‌ జిల్లా సెక్రటరీలు మల్లికార్జునరెడ్డి బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన బేస్‌బాల్‌ జట్లు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సెప్టెంబర్‌ 12, 13, 14వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్‌ బేస్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాలకు 86398 22789 ఫోన్‌ నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు

అరుదైన అవకాశం

వేంపల్లె : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించనున్న ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌కు ట్రిపుల్‌ ఐటీకి చెందిన క్రీడా విద్యార్థులకు అవకాశం లభించడం ఆర్జీయూకేటీ సంస్థకు, ఆర్కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీ గర్వకారణమని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయప్రకాష్‌ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే క్రీడా విద్యార్థులతో బుధవారం ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయప్రకాష్‌ సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. అలాగే కార్యక్రమం ప్రాధాన్యతను వివరించడంతోపాటు క్రమశిక్షణ, సమయపాలన, క్రీడాస్ఫూర్తి, ఆత్మవిశ్వాసంతో కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ ఈనెల 29న దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 27న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సుమారు 1,600 ప్రాంతాల నుంచి పాల్గొనే 8లక్షల మందికిపైగా యువతను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించనున్న ట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువ క్రీడాకారులను ఒకే జాతీయ వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement