రాయచోటి : చిన్నమండెం మండలం, దేవపట్ల క్రాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. చిన్నమండెం మండలం బలిజపల్లికి చెందిన శీతక నాగార్జున (35), శీతక కొండారెడ్డి(55)లు బుధవారం బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చిన్నమండెం పోలీసులు తెలిపారు. ప్రమాద సంఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరు రాయచోటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించే సమయంలో మృతి చెందాడు. మృతి చెందిన ఇద్దరికీ భార్య, పిల్లలు ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడడంతో బలిజపల్లి గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చిన్నమండెం పోలీసులు తెలిపారు.


