డబ్ల్యూఏపీఎల్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

డబ్ల్యూఏపీఎల్‌కు ఎంపిక

Aug 26 2026 12:42 AM | Updated on Aug 26 2026 12:42 AM

ప్రొద్దుటూరు : ఉమెన్స్‌ ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలకు ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లెకు చెందిన ముని నితిషారెడ్డి ఎంపికయ్యారు. బ్యాటింగ్‌, ఆల్‌రౌండర్‌ విభాగంలో రూ.30 వేలకు వేలం పాటలో ఎంపికై న ఈమె, కోచ్‌ నరేష్‌రెడ్డి వద్ద శిక్షణ పొందుతూ సెప్టెంబర్‌ 16 నుంచి అమరావతిలో జరిగే పోటీలలో పాల్గొననున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

సిద్దవటం : కుందూ నది నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ హారిక సూచించారు. మంగళవారం ఆమె ఇసుక తవ్వకాల గోతులు, ఉధృత నీటి ప్రవా హం వల్ల నదీ తీరాల్లోకి ఎవరూ దిగవద్దన్నారు.

అత్యధిక ఆలయాలు

కట్టించిన సీఎం జగన్‌

కడప ఎడ్యుకేషన్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో అత్యధికంగా హిందూ దేవాలయాల నిర్మాణం చేయించిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా వెంకటయ్య స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి తిరుమలలో చేసిన విమర్శలు దురుద్దేశపూర్వకమైనవని ఖండించారు. జగన్‌ హయాంలో శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా 3,000 ఆలయాల లక్ష్యంతో 2,068 ఆలయాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. జమ్మూలో 17 కోట్ల 40 లక్షల రూపాయలతో కట్టిన క్షేత్రంతో పాటు చైన్నె, విశాఖపట్నం, రంపచోడవరం, సీతంపేట, అమరావతి, భువనేశ్వర్‌, హైదరాబాద్‌లలో భవ్య మందిరాలు నిర్మించారని గుర్తుచేశారు. ఇవన్నీ జగన్‌ హయాంలో నిర్మించలేదని నిరూపించగలరా అని విజయసాయిరెడ్డికి ఆయన సవాలు విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement