కడప సెవెన్ రోడ్స్ : 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు కడప పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో చేపడుతున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌కు సంబంధించి ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మురళి, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, జిల్లా విద్యా శాఖాధికారి షంషుద్దీ్‌న్ తదితరులు పాల్గొన్నారు.


