ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

కడప సెవెన్‌ రోడ్స్‌ : మనం ఒక మొక్క నాటితే.. భావితరాలకు ఒక మంచి భవిష్యత్తును అందించినట్లేనని..పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పిలుపునిచ్చారు.80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనం, భావితరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించడాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న నర్సరీల వివరాలను పొందుపరచిన కరపత్రాలను జిల్లా కలెక్టర్‌, జేసీ, డీఎఫ్‌ఓ, డీఆర్వో ఆవిష్కరించారు.కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీనా, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్‌ బాబు, డీఆర్వో మల్లికార్జునుడు, కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement