విత్తనాలు, పశుగ్రాసంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

విత్తనాలు, పశుగ్రాసంపై దృష్టి సారించాలి

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులురెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి అన్నారు. ఎల్‌నినోపై గురువారం కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అధ్యక్షతన కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆయా ప్రాంతాలకు అనుకూలమైన పంటలు సాగు చేసుకోవడానికి విత్తనాలను రైతులకు ముందుగానే అందుబాటులో ఉంచాలని కోరారు. రానున్న రోజుల్లో పశుగ్రాస కొరత లేకుండా చూసేందుకు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటి విడుదల ప్రారంభం కావడంతో జీఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్‌ నిధి మీనా, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎస్‌ భావన, ఎమ్మెల్యే చైతన్యకృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్టార్టప్‌ కడపతో దాల్మియా భాగస్వామ్యం

స్టార్టప్‌ కడపతో దాల్మియ సంస్థ వ్యూహాత్మక భాగస్వామ్యం అందించేందుకు అంగీకరించిందని కలెక్టర్‌ తెలిపారు. గురువారం దాల్మియ సంస్థ డైరెక్టర్‌ పునీత్‌ ఎదు దాల్మియాతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. స్టార్టప్‌ కడప లక్ష్యాలు, కార్యాచరణ, భవిష్యత్తు భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. దీనిపై పునీత్‌ దాల్మియా స్పందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర స్టార్టప్‌ వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్టార్టప్‌ కడపకు పలు కీలక సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ భావన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేల ప్రతిపాదనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement