పాముకాటుతో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో యువకుడు మృతి

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

కొండాపురం: కూలీ పను లు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉన్న ఓ యువకుడు విష పురుగు కుట్టడంతో చికిత్స పొందు తూ మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కొండాపురం ఇన్‌చార్జి ఎస్‌ఐ మంజునాథ వివరాల మేరకు... మండలంలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రాజు(33)ను ఈనెల 3న ఇంటి సమీపంలో విషపురుగు కుట్టింది. నొప్పిగా ఉండటంతో 5వ తేదీ అనంతపురంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. అక్క చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుండె పోటుతో ఉపాధి కూలి..

అట్లూరు : ఉపాధి పనుల్లో పాల్గొన్న కూలి గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బంధువుల వివరాల మేరకు... రెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన మద్దెల ఓబులేసు (59) రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో వీబీజీరాంజీ ద్వారా చేపట్టిన పండ్ల తోటల పెంపంకంలో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలు తీసే పనిస్తున్నాడు. ఉన్నట్టుండి ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు బంధువులకు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్‌లో ఆయనను కడప రిమ్స్‌కు తరలించే లోపే మృతి చెందాడని తెలిపారు.

ద్విచక్రవాహనం అదుపుతప్పి..

చెన్నూరు(వల్లూరు): కడప– కర్నూలు ప్రధాన రహదారిపై చెన్నూరు మండల పరిధిలోని చిన్న మాచుపల్లె సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొండపేటకు చెందిన కుప్పం రమణ (41) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు చెన్నూరు మండలంలోని బయనపల్లెకు చెందిన కుప్పం రమణ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతడు పని మీద ద్విచక్ర వాహనంలో కడపకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా చిన్న మాచుపల్లె వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కడప రిమ్స్‌ మార్చురీకి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement