దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు స్వీకరిస్తున్నాం..

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

నేతన్న సేవా పథకం ద్వారా ఈనెల 7వ తేదిన జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అర్హులైన చేనేత కుటుంబాలకు రూ. 25 వేలు చొప్పున పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి నేత కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. దీంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతున్నాం.

– సయ్యద్‌ అహ్మద్‌ మైనుద్దీన్‌,

జిల్లా చేనేత జౌళిశాఖ అధికారి, కడప

మగ్గాన్ని వదిలేసే పరిస్థితి

చేనేతను వదిలేసి మగ్గాన్ని పక్కన పెట్టి ఇతర వృత్తుల్లోకి వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతటి దారుణ పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదు. నేసిన చీరలు అమ్ముడుపోక మాస్టర్‌ వీవర్స్‌ డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లభించలేదు.

– మల్లూరు లక్ష్మయ్య, నేత కార్మికుడు

బతుకు భారమైంది

చిన్నప్పటి నుంచి నేత పని చేస్తున్నాను. ప్రభు త్వం నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో మా బతుకు భారంగా మా రింది. మాకు ఈ పని తప్ప వేరే పనిచేతకాదు. అప్పు ల పాలై దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాం.

– చేకూరి శ్రీహరి, మాధవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement