బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Aug 6 2026 2:14 AM | Updated on Aug 6 2026 2:14 AM

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఏపీఎస్‌ ఆర్టీసీ కడప జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా రాయసం రామకృష్ణ కిశోర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1992లో ఆర్టీసీ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో డిపో మేనేజర్‌గా పనిచేశారు. అనంతరం 2016–19 మధ్య డిప్యూటీ సీటీఎంగా పనిచేస్తూ ఢిల్లీలో డైరెక్టర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ మినిష్టర్‌ ఆఫ్‌ రోడ్స్‌ అండ్‌ హైవేలో విధులు నిర్వర్తించారు. విజయవాడలో చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ స్టోర్స్‌లో పనిచేస్తూ పదోన్నతిపై కడప ఈడీగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన కడపకు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బస్సుల కండీషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మానవ తప్పిదాలతోజరిగే రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఆర్టీసీ డ్రైవర్లను జాగృతం చేస్తామన్నారు. ఆర్టీసీకి మరో వరంగా ఉన్న కార్గో సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా సిబ్బందిని అప్రమత్తం చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement