నేడు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ కలెక్టర్‌

Jul 20 2026 1:26 AM | Updated on Jul 20 2026 1:26 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ మల్లికార్జునుడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు 08562–244437 ల్యాండ్‌ లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు.

● కలెక్టరేట్‌లో జరిగే కాల్‌ సెంటర్‌, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్‌ఓ తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా,లేదా తమ ఫిర్యాదులకుసంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్‌ చేయవచ్చునన్నారు.

● కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో సోమవారం ప్రజాసమస్యలపరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నిర్వహించడం జరుగుతుందని డీఆర్‌ఓ తెలిపారు. అన్ని శాఖల జిల్లాఅధికారులు పాల్గొంటారని తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌పై ప్రజాభిప్రాయానికి

క్యూ ఆర్‌ కోడ్‌

కడప సెవెన్‌ రోడ్స్‌ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎప్‌) ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రభుత్వం రూపొందించిన పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూ ఆర్‌ కోడ్‌ను ప్రజలు వినియోగించాలని జిల్లా ప్రజా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రతి సోమ వారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ సమావేశాలకు హాజరయ్యే ప్రజలు తమ వినతులు, ఫిర్యా దులు సమర్పించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూ ఆర్‌ కోడ్‌ను తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేసి అభిప్రాయాలను నమోదు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement