21న వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

21న వైద్య శిబిరం

Jul 16 2026 5:12 AM | Updated on Jul 16 2026 5:12 AM

కడప సిటీ : జిల్లా అర్చక పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈనెల 21న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సమాఖ్య గౌరవ సలహాదారులు సరస్వతుల నాగరాజుశర్మ, జానమద్ది విజయ్‌ భాస్కర్‌, సరస్వతుల శివ సత్యకుమార్‌ శర్మ, సమాఖ్య జిల్లా అధ్యక్షుడు విజయ్‌ బట్టర్‌ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. సమాఖ్య సభ్యుల ఆధ్వర్యంలో పల్స్‌ హాస్పిటల్‌ ఎండీ, ప్రముఖ వైద్యులు వంశీధర్‌ నేతృత్వంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. చిన్నచౌక్‌ ఓల్డ్‌ బైపాస్‌లోని శ్రీ పల్స్‌ హాస్పిటల్‌లో ఉదయం 8.30 నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో గుండె, కిడ్నీ, వెరికోస్‌, షుగర్‌, బీపీ, థైరాయిడ్‌, న్యూరో సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. పేర్ల నమోదు కోసం 93914 43265 (నాగేశ్వరరావు), 99496 83377 (రామ్మోహన్‌), 98666 62160 (జీవన్‌) నంబర్లను సంప్రదించాలని కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం

కడప ఎడ్యుకేషన్‌: ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు 2025–26 విద్యా సంవత్సరంలో ఏప్రిల్‌ 30వ తేదీ వరకు సర్వీసులో ఉన్న, జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేసిన ఒప్పంద అధ్యాపకులు 2026–27 విద్యా సంవత్సరానికి రెన్యువల్స్‌ కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఐడీ కళాశాల(ఆర్ట్స్‌ కళాశాల) ప్రిన్సిపల్‌ డాక్టర్‌. జె. వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ లోపు వారు పనిచేస్తున్న సంబంధిత కళాశాలల్లోని ప్రిన్సిపాళ్లకు అందజేయాలని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు, ద్రువీకరణ పత్రాలు జత చేయాలని సూచించారు.

ఆర్థిక గణాంకాలపై

అధికారులకు శిక్షణ

కడప సెవెన్‌రోడ్స్‌ : ఆర్థిక గణాంకాలపై జిల్లా, మండల స్థాయి అధికారులకు బుధవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ హాలులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పహెలె ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలతోపాటు స్థూల విలువ ఆధారిత ఉత్పత్తి (జీవీఏ), స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ), జిల్లా దేశీయోత్పత్తి (డీడీపీ) లాంటి కీలక ఆర్థిక సూచికలను శాసీ్త్రయంగా ఎలా లెక్కించాలో అధికారులకు అవగాహన కల్పించారు. సీపీఓ హజరతయ్య తదితరులు పాల్గొన్నారు.

18న జిల్లాస్థాయి

ఫుట్‌బాల్‌ ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఆర్ట్స్‌) మైదానంలో ఈనెల 18న జిల్లాస్థాయి బాలబాలికల ఫుట్‌బాల్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డేనియల్‌ ప్రదీప్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 2013 జనవరి 1 నుంచి 2014 డిసెంబర్‌ 31 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ ఆధార్‌ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్‌, క్రీడా సామగ్రితో హాజరుకావాలని కోరారు.

నేటి నుంచి పాలిసెట్‌

తుది కౌన్సెలింగ్‌

కడప ఎడ్యుకేషన్‌: పాలిసెట్‌ తుది విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిందని కడప ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌, పాలిసెట్‌ కో–ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉంటుందని వివరించారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ polycet.ap.gov.in లో అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను పరిశీలించి నిర్ణీత గడువులోపు తమ సర్టిఫికెట్‌ ధ్రువీకరణ, ఫీజు చెల్లింపుతోపాటు వెబ్‌ ఆప్షన్ల నమోదును పూర్తి చేసుకోవాలని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 25 నుంచి 29 వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని తెలిపారు.

యువతిపై అత్యాచారయత్నం!

కడప అర్బన్‌: కడప ప్రకాష్‌ నగర్‌కు చెందిన కె. కిరణ్‌ కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి తన మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌లో పనిచేస్తున్న యువతిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న చౌక్‌ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ప్రకాష్‌ నగర్‌కు చెందిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆటో మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతని దగ్గర ఓ యువతి పనిచేస్తోంది. రెండు రోజుల క్రితం సామాన్ల కోసం ఇంట్లోకి రాగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆమైపె అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు. బాధితు రాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయగా.. ప్రాథమిక ఆధారాలు లభించాయన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచామన్నారు. కోర్టు ఆదేశాల మేర కు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement