కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇన్‌స్పైర్ మనాక్ నామినేషన్ నమోదు ప్రక్రియ జూలై 15వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్ ఇన్‌స్పైర్ యాప్‌లో ప్రారంభమైందని జిల్లా సైన్సు అధికారి లేబాక బాలాజీ తెలిపారు. డీఈఓ డాక్టర్ షంషుద్దీన్ ఆదేశాల మేరకు బుధవారం కడప గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా ఐదుగురు విద్యార్థుల నుంచి వినూత్న, సృజనాత్మక ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను నామినేట్ చేయాలని సైన్సు ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ సుబ్బానాయుడు, గంగాధర్, తిరుమల కొండు, మాజీ జిల్లా సైన్సు అధికరి నిత్యానంద రెడ్డి, సర్ సీవీరామన్ సైన్సు క్లబ్ కడప గౌరవాధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు, ఎన్‌జీసీ కోఆర్డినేటర్ విజయప్రసాద్, వీవీయం కో–ఆర్డినేటర్ క్రిష్ణకిషోర్, తదితరులు పొల్గొన్నారు.


