సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే సహించం
కడప సెవెన్‌రోడ్స్ : ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తే సహించబోమని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను పునరుద్ధరించి నిధులు కేటాయించాలన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు ఇవ్వాలన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే దళితులను అన్ని రకాల ఆదుకుంటామని కల్లబొల్లి హామిలు ఇచ్చిన చంద్రబాబు ఆ మేరకు కన్నెత్తి చూడడం లేదని విమర్శించారు. దళితుల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు పునరుద్ధరించకపోతే దశల వారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, మహిళా సమాఖ్య నాయకులు భాగ్యలక్ష్మి, సీపీఐ నగర నాయకులు మల్లికార్జున, బ్రహ్మం, డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇమ్మానియల్, మునెయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర


