ఈ వ్యక్తి కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వండి | - | Sakshi
Sakshi News home page

ఈ వ్యక్తి కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వండి

Dec 23 2025 7:12 AM | Updated on Dec 23 2025 7:12 AM

ఈ వ్యక్తి కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వండి

ఈ వ్యక్తి కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వండి

వేంపల్లె : ఫోటోలోని వ్యక్తి ఆచూకీ కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని వేంపల్లె సీఐ టి.నరసింహులు విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోనీ పిరమిడ్‌ నగర్‌లో ఉన్న చౌడేశ్వరిదేవి గుడి వద్ద భిక్షాటన చేస్తూ ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి తిరుగుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఈనెల 4న చౌడేశ్వరిదేవి గుడి సమీపంలో ఏపీ 40 డీటీ 9402 నెంబర్‌ కలిగిన హోండా ఆక్టివా స్కూటీని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల సాయంతో ఫొటోలోని వ్యక్తి ఆ స్కూటీని దొంగిలించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికాన్ని ప్రకటించారు. అలాగే సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement