
సామాజిక మాధ్యమాలే వేదికగా మోసాలు
ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్
కడప అర్బన్ : సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేస్తున్నారని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్ మార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌్‌లైన్ పెట్టుబడి మోసాల కేసులు నమోదవుతున్నాయని, డబ్బులు మోసమోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసగాళ్లు ముందుగా ‘ఇన్వెస్ట్ చేసి డబ్బు డబుల్ చేసుకోండ్ఙి అంటూ లింకులు పంపుతారని, మీరు పెట్టుబడిగా పెట్టిన రూ.1000 లేదా రూ.2000కు ముందు డబుల్ నగదు ఇచ్చినట్లు చూపి నమ్మిస్తారన్నారు. తర్వాత భారీ లాభాల కోసం డిపాజిట్లు చేయమని చెప్పి మోసం చేస్తారన్నారు. అనంతరం యాప్ లింక్ బ్లాక్ చేయడం, డబ్బు విత్‌డ్రా కాకుండా చేయడం చేస్తారని తెలిపారు. వాట్సాప్ ద్వారా ఓ మహిళ రూ.1.98కోట్లు, మరో యువకుడు రూ.17 లక్షలు నష్టపోయారని తెలిపారు. ఓ యువకుడికి మ్యాట్రిమొనీ ద్వారా ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతి..్ఙషేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో గ్యారెంటీ ప్రాఫిట్ఙ్ అంటూ చెప్పి నమ్మించడంతో లక్షల రూపాయలు నష్టపోయినట్లు తెలిపారు. ఆర్‌బీఐ, ఎస్‌బీఐ వంటి చట్టబద్ధ సంస్థల నుంచి గుర్తింపు పొందని యాప్‌లలో డబ్బు పెట్టిమోసపోవద్దని సూచించారు. మోసానికి గురైతే సైబర్ క్రైమ్ సెల్ లేదా 1939కు ఫిర్యాదు చేయాలని సూచించారు.