కడప కార్పొరేషన్: జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రెండెద్దుల హరినారాయణరెడ్డిని రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొంది.
కడప కోటిరెడ్డిసర్కిల్: నిహార్ ఓవర్సీస్ ఆధ్వర్యంలో, వోక్స్ ఓవర్సీస్ సహకారంతో కడప జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్‌లో ఈ నెల 17వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విదేశీ విద్యపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిహార్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ రీజినల్ కో–ఆర్డినేటర్ నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు, ‘రష్యా, జార్జియా, ఫిలిప్పైన్స్, ఇటలీ, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆర్మేనియా, యుకె, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశా ల్లో ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్, హోటల్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులపై నిపుణులు తెలియజేస్తారన్నారు. విదేశీ చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరై, తమ భవిష్యత్ విద్యా ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆమె సూచించారు.
జమ్మలమడుగు: మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోనికి భారీగా నీటిని విడుదల చేశారు. పెన్నానదిలోనికి మైలవరం జలాశయం నుంచి పదివేల క్యూసెక్కుల నీటిని అధికారులు సోమశిల ప్రాజెక్టుకు విడుదల చేశారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ ద్వారా 13వేల క్యూసెక్కుల నీరు గండికోట జలాశయంలోనికి వస్తుంది. ప్రస్తుతం గండికోట జలాశయంలో 16టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. అదేవిధంగా మైలవరం జలాశయంలో 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పై నుంచి వస్తున్న నీటిని అధికారులు నేరుగా పెన్నాలోకి విడుదల చేస్తున్నారు.
కడప ఎడ్యుకేషన్: విద్యాహక్కు చట్టం ప్రకారం 12.1.సి. లో మిగిలిపోయిన సీట్లకు 5 కిలోమీటర్ల దూరం లోపు విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ నిత్యానందరాజులు తెలిపారు. ఈ మేరకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. గురువారం ఏపీసీ నిత్యానందరాజులు మాట్లాడుతూ అనాథ పిల్లలు,హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు దరఖాస్తు చేసుకోవాల ని సూచించారు. ఈ నెల 20లోగా దరఖాస్తులను ఆన్లైన్ లో చేసుకోవాలన్నారు. ఒకటవ తరగతికి మాత్రమే ఈ అడ్మిషన్లు ఉంటాయన్నారు. సచివాలయాల్లో, ఇంటర్నెట్ కేంద్రాల్లో, మీ సేవా కేంద్రాల్లో, మండల విద్యాశాఖ కార్యాలయాల్లో ఆన్లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆయనతోపాటుగా నోడల్ అధికారి లక్ష్మి నరసింహ రాజు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట(సిద్దవటం): ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని ఒంటిమిట్ట జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఒంటిమిట్టలో ఆయన మాట్లాడుతూ 13వ తేదీ జరిగిన ఎన్నికలు తీరు బాగాలేదన్నారు.కానీ ఈరోజు ఫలితాలు వెలువడ్డాయి. ఒంటిమిట్టలో 11 గంల వరకు 8వేల ఓట్లు పోలయ్యాయన్నారు. తర్వాత పోలీసు ప్రొటెక్షన్‌తో మంత్రి వచ్చి 10వేల పై చిలుకు రిగ్గింగ్ చేసుకున్నారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగింటే గెలుపు తమదేనని, టీడీపీవారు ఓటమి చెందేవారన్నారు. సిట్టింగ్ జడ్జి చేత ప్రతి గ్రామానికి పోదాం.. ప్రతి ఓటరును పిలుస్తాం.. వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసిఉంటే వేలిమీద సిరాచుక్క ఉండాల.. దీనికి ఒప్పుకుంటారా.. అని ఓపెన్ చాలెంజ్ చేశా రు. ఒంటిమిట్ట, పులివెందులలో చేతిమీద సిరా చుక్క లేకుంటే మీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్లు వేసుకున్నట్లే కదా అని అన్నారు. ఈ చాలెంజ్‌కు మంత్రులు, నాయకులుగాని, సంబరాలు చేసుకునేవారు ఎవరైనా సరే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. తమ ఏజెట్లను, ఓటర్లను కొట్టి ఓట్లను రిగ్గింగ్ చేసుకున్నారన్నారని ఆయన ధ్వజమెత్తారు.
నియామకం