
●ప్రతిష్టాత్మక విశిష్ట సేవా పతకానికి ఎంపిక
కడప అర్బన్: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక విశిష్ట సేవా పతకాన్ని కడప సీసీఎస్ ఎస్‌ఐ బి.ప్రకాష్ రావుకు ప్రకటించారు. ఈ సందర్బంగా ఎస్పీ అశోక్ కుమార్, ఎస్.ఐ ప్రకాష్ రావును అభినందించారు. బి.ప్రకాష్ రావు 1984లో జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో పులివెందుల, మైదుకూరు, ప్రొద్దు టూరు, కడప ట్రాఫిక్, కడప వన్ టౌన్ తదితర పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. తన సర్వీస్ లో 45 నగదు రివార్డులు, 38 జి.ఎస్.ఈ లను ఉన్నతాధికారుల నుంచి అందుకున్నారు.