మహానాడు.. మందు.. విందు
గ్లాసు పట్టు.. మందు కొట్టు.. మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, కడప: మహానాడు.. మందు.. విందు.. మూడుముక్కల్లో చెప్పాలంటే మూడు రోజుల పసుపు పండగ సాగిన తీరిదే.. ముఖ్యంగా కడప గడపలో మద్యం ఏరులై పారింది. కడప నగరంలో నెలరోజులు పాటు ఖర్చు అయ్యే మద్యం మూడు రోజుల్లోనే ఖర్చైంది. గురువారం బహిరంగసభ కారణంగా గ్రామాల గల్లీల నుంచి ప్రధాన రహదారుల వరకూ మందుబాబులు తాగి చిందులేశారు. జనసమీకరణ కోసం పచ్చనోట్లు పంచడంతో అందుకున్న ప్రజలు ఎక్కడిక్కడ మద్యం తాగు తూ కనిపించారు.కొందరు తూలి కింద పడ్డారు..నిద్రలోకి జారుకున్నారు. మహానాడు సందర్భంగా సమీపంలోని వైన్ షాపులను మూసివేసి ఉండే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు.
● కడప గడపలో 22 మద్యంషాపులుంటే దాదాపు అన్నీంట్లో రద్దీ విపరీతంగా ఉండిపోయింది. మంగళ, బుధవారాలల్లో నగరంలోని మద్యంషాపులల్లో వ్యాపారం రూ.65లక్షలు చొప్పున చోటుచేసుకోగా గురువారం 5 రెట్లు అధికంగా దాదాపు రూ.3కోట్లు పైబడి వ్యా పారం లభించినట్లు సమాచారం. చిత్తూరు–కర్నూల్ జాతీయ రహదారి వెంబడి మందుబాబులు తిష్టవేసి మద్యం సాగారు. ఇటు కడప–రేణిగుంట రహదారిలో కూడా ఇదే పరిస్థితి.
కడపలో వలసపక్షులకే ప్రాధాన్యత...
కడప నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న కార్యకర్తలకు న్యాయం లభించలేదని టీడీపీ మాజీ మహిళా అధ్యక్షరాలు చిప్పగిరి మీనాక్షి ఆరోపిస్తూ బుధవారం సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం మరోమారు అదే విషయం తేటతెల్లమైంది. వలస పక్షలకు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు. వారి చేతికే డబ్బులు అప్పగించి జనాన్ని సమీకరించాలని ఆదేశించినట్లు సమాచారం. పాతతరం నేతలెవ్వరిని జనసమీకరణలో ప్రోత్సహించలేదని సమాచారం. కడప నగరంలో డ్వాక్రా మహిళలు కదలకుంటే జనం ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ సీనియర్ నాయ
కుడొకరు చెప్పుకొచ్చారు.
ఎండవేడిమికి వెనుతిరిగిన జనం...
మహానాడు బహిరంగసభకు జనాన్ని సమీకరించారు, కానీ వారిని సభ అయ్యేంత వరకూ అలాగే నిలువరించలేపోయారు. ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. కాసేపు కూర్చు న్నా వెనుకవైపు నుంచి జనం జారుకోవడం కన్పించింది. 3గంటలకు వేదిక మీదకు సీఎం రావడం 4.20 నిమిషాలకు ప్రసంగం మొదలు పెట్టారు. అప్పటికే బాగా జనం వెనుకడుగు వేస్తుండడం కన్పించింది.
అభివృద్ధికి నిర్ధిష్ట ప్రణాళిక ఏదీ?
ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు, చర్చించారు, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించారు. రాయలసీమ అటుంచితే కనీసం కడప జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రచించారనుకున్న వారికి చేదు అనుభవమే ఎదురైంది. జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌ను నాన్ ప్రియారిటీ జాబితాలో పెట్టిందే చంద్రబాబు హాయాంలోనే జిల్లాలో పాతతరం నాయకులు ఎవరైనా సరే, ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించగలరు. కడప ఎమ్మెల్యే కోరిక మేరకు దేవుని కడపను పర్యాటక కేంద్రంగా చేస్తామని ప్రకటించడం మినహా నిర్దిష్టమైన ప్రణాళిక వెల్లడించలేదు. కమలాపురం ఎమ్మెల్యే ఏపీఐఐసీ భూములల్లో భారీ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని కోరినా సీ ఎం నోటా హామీ లభించకపోవడం గమనార్హం.
పాపం.. డ్వాక్రా మహిళలు
ముఖ్యమంత్రి బహిరంగసభకు డ్వాక్రా సభ్యులు కచ్చితంగా హాజరు కావాలని యానిమేటర్లు అల్టిమేటం జారీ చేశారు. ఎవరైనా హాజరు కాలేని పక్షంలో వారి తరుపునా కూలీలను హాజరు పర్చాలని ఆదేశించారు. ప్రతి సంఘం వారి వారి గ్రూపు ఫొటో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అందుకు విరుద్ధంగా వ్యవహారిస్తే భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలు ఏవీ వర్తించవని డ్వాక్రా గ్రూపు లీడర్లును యానిమేటర్లు బెదిరించారు. యానిమేటర్లు వాయిస్ మెసేజ్ వైరల్ కావడంతో డ్వాక్రా సభ్యులు పెద్ద ఎత్తున మహానాడు సభకు హాజ రయ్యారు. గ్రామాల కంటే పట్టణాలు, నగరాలల్లోని డ్వాక్రా సభ్యులు భారీగా తరలిరావడంతో దాదాపు 40శాతం మంది సభా ప్రాంగణంలో మహిళలే కనిపించారు.
గల్లి నుంచి ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసిన మద్యం ప్రియులే
జనసమీకరణ కోసం డబ్బుల పంపిణీ, వాహానాలు ఏర్పాటు
ఎండవేడిమికి తట్టుకోలేని జనం మధ్యలోనే నిష్క్రమణ
మహానాడు.. మందు.. విందు
మహానాడు.. మందు.. విందు
మహానాడు.. మందు.. విందు


