వైఎస్ జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని బేతేలు చర్చి సమీపంలో ఉన్న టీడీపీ నాయకులు బుధవారం కౌన్సిలర్ శ్యామలాదేవి, కౌన్సిలర్ కోడి రమణ, చిన్నల ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీకి చెందిన యూసఫ్, నూరి, ఇబ్రహీం, ఖాజా, షమీనా, భాను, మాబ్‌జాన్, ఆయేషా, చిన్న ఆయేషా, హజీరా, హనీఫా, ఆదాం, మహమ్మద్, హమీదా, మాబ్‌జాన్, రబియా, షబీనా, మున్ని, మా బాషా, షబీనా, అమ్మాజి, నూర్ మున్నా తదితరులకు పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి పారీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరిన వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అన్ని పథకాలు ఇంటి వద్దకు వచ్చి అందించేవారని, ఈ ప్రభుత్వంలో ఒక పథకం కూడా అందలేదన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది శూన్యమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు కూటమిని వీడి వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు. గత ప్రభుత్వంలో 15 రోజులు ఇంటి వద్దకు వచ్చి రేషన్ బండ్లు రేషన్ ఇచ్చేవని, ఈ కూటమి ప్రభుత్వంలో రెండు రోజులకే రేషన్ బియ్యం అయిపోయాయని డీలర్లు చెబుతున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయన్నారు. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం రాజ్యమేలుతోందన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు వేచి ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్, మాజీ చైర్మన్లు చిన్నప్ప, రసూల్, వైఎస్సార్‌సీపీ నాయకులు వీరారెడ్డి, చలపతి, నరసారెడ్డి, కనక పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
జగనన్న పాలన బెస్ట్..
కూటమి పాలన వేస్ట్
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో
20 కుటుంబాల చేరిక
కండువాలు కప్పి పార్టీలోకి
ఆహ్వానించిన వైఎస్ మనోహర్‌రెడ్డి


