రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడికి తీవ్ర గాయాలు
కడప కోటిరెడ్డిసర్కిల్/నందలూరు : అన్నమయ్య జిల్లా నందలూరు రైల్వే స్టేషన్ యాడ్ సమీపంలో 30 సంవత్సరాల వయస్సుగల గుర్తు తెలియని యువకుడు గూడ్స్ రైలు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారాన్ని అందుకున్న ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది క్షతగాత్రుడిని తొలుత రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతరం కడప రిమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మాట్లాడే స్థితిలో లేకున్న ఆ యువకుడి వివరాలు తెలియాల్సింది. ఇతనికి సంబంధించిన వారు తమను సంప్రదించాలని కడప రైల్వే పోలీసులు తెలిపారు.
ఎస్పీ క్రిస్మస్ శుభాకాంక్షలు
కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం ఒక ప్రకటనలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం, ప్రేమ, కరుణకు ప్రతీకగా జరుపుకునే మహత్తర పండుగ అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత జీవనం వంటి విలువలు మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు.
తరిగొండ దర్గాలో
హుండీ ఆదాయం చోరీ
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ హజరత్ మురాద్‌షావలీ దర్గాలో రెండు హుండీలను పగులగొట్టి అందులో డబ్బులను దుండగులు చోరి చేసుకెళ్లిన సంఘన బుధవారం జరిగింది. గ్రామానికి సమీపంలో ఉన్న ఈ దర్గాకు ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. భక్తులు బాబాకు కానుకలను హుండీలో వేసి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఈనేపథ్యంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు దర్గాలోని రెండు హుండీలను పగులగొట్టి అందులో నగదును ఎత్తుకెళ్లారు. దర్గాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేసి డేటా రికార్డులు ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈరోజు యథావిధిగా దర్గా తెరవడానికి వచ్చిన దర్గా నిర్వాహకులకు హుండీలు పగులగొట్టిన దృశ్యాలు కనిపించాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడికి తీవ్ర గాయాలు


