రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలో విద్యార్థుల ప్రతిభ
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు – 2025లో కడపలోని శ్రీ సాయి విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభను చాటారు. ఇందులో హర్షిత్ సాయి, రిషిత రామ్, చరణ్ రాష్ట్ర స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచి రెండవ స్థానంలో నిలిచారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మైథిలి, అకడమిక్ డైరెక్టర్ జితేంద్ర, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శివరాం కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


