పైనాపిల్ కాసింది..!
పుల్లంపేట : పుల్లంపేట మండలం, అనంతంపల్లి గ్రామానికి చెందిన శేషారెడ్డి తన ఇంటిలో పైనాపిల్ మొక్క తెచ్చి నాటాడు. దీంతో పైనాఫిల్ విరగకాయడంతో గ్రామంలోని ప్రజలు వింతగా చూస్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో పైనాపిల్ పండదని, అలాంటిది శేషారెడ్డి ఇంటిలో విరగకాయడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నిమ్మతోట దగ్ధం
పెనగలూరు : పెనగలూరు మండలం, కాకర్లవారిపల్లి పంచాయతీ వెంకటనారాయణ పల్లి వద్ద నిమ్మతోట దగ్ధమైనట్లు ఫైర్ అధికారి శివయ్య తెలిపారు. గురువారం వేపాటి వారిపల్లికి చెందిన పి.పెంచలయ్య నిమ్మతోట అగ్నికి ఆహుతవుతుండగా ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వెంటనే వారు అక్కడికి చేరుకుని ఆర్పివేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో చుట్టూ ఉన్న కంచె పూర్తిగా దగ్ధమైంది. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో నిమ్మతోట పూర్తిగా దగ్ధం కాలేదు. దాదాపు రూ.80 వేలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారి తెలిపారు.
భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంట్
ఒంటిమిట్ట : అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు భారతి సిమెంట్ పటిష్టమైందని భారతి సిమెంట్ డీజీఎం ఓబుల్ రెడ్డి, జిల్లా ప్రధాన మార్కెటింగ్ అధికారి ప్రతాప్ రెడ్డి, జిల్లా టెక్నికల్ ఇంజినీర్ శ్రీకాంత్ రెడ్డి, సేల్స్ ఆఫీసర్ రమణా రెడ్డి తెలిపారు. ఒంటిమిట్టలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్ సమీపంలోని మేసీ్త్రలకు సిమెంట్ వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా భారతి సిమెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటెక్ టెక్నాలజీతో తయారవుతుందని, అల్ట్రాఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందన్నారు. రొబోటిక్స్ ప్రయోగశాల, జర్మన్ టెక్నాలజీ తక్కువ సమయంలో ఎక్కువ కట్టడాలు చేయగల సామర్థ్యం కలవన్నారు. ఇతర కంపెనీల సిమెంట్ ఐదు గంటల్లో సెట్ అయితే భారతి అల్ట్రాఫాస్ట్ రెండు గంటల్లో సెట్ అవుతోందని, దృఢత్వం కల్గి ఉంటుందని, కట్టడాలు త్వరగా పూర్తవుతాయని తెలిపారు. అనంతరం మేసీ్త్రలకు లక్ష ఉచిత బీమా బాండ్, బీమా పత్రాలను యాభై మంది మేసీ్త్రలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ పాండురంగారెడ్డి, మేసీ్త్రలు పాల్గొన్నారు.
పైనాపిల్ కాసింది..!


