కడప మహిళా స్టేషన్‌ డీఎస్పీగా బాలస్వామిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

కడప మహిళా స్టేషన్‌ డీఎస్పీగా బాలస్వామిరెడ్డి

Apr 29 2025 7:11 AM | Updated on Apr 29 2025 7:11 AM

కడప మ

కడప మహిళా స్టేషన్‌ డీఎస్పీగా బాలస్వామిరెడ్డి

కడప అర్బన్‌ : కడప మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీగా బాలస్వామి రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1995 బ్యాచ్‌కి చెందిన ఈయన ఎస్‌ఐగా జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో విధులు నిర్వహించారు. 2007లో సీఐగా, 2020లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కడప హ్యూమన్‌ రైట్స్‌ డీఎస్పీగా పనిచేస్తూ కడప మహిళా పోలీస్‌ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ ఫిర్యాదులపై సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కడపలో బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

కడప అర్బన్‌ : కడప నగరంలోని వైవీ స్ట్రీట్‌లో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ టీం బృందం వారు తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానితులుగా ఉన్నా, వస్తు సామగ్రి కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వ్యాపారులకు, ప్రజలకు సూచించారు.

రిమ్స్‌ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

కడప అర్బన్‌ : కడప రిమ్స్‌కు ఈనెల 24వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి (48)ని చికిత్స నిమిత్తం తీసుకు వచ్చారు. అతనికి వైద్య పరీక్షలు చేసిన క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌ మరణించాడని నిర్ధారించారు. అతని మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు.

కడప మహిళా స్టేషన్‌ డీఎస్పీగా బాలస్వామిరెడ్డి1
1/2

కడప మహిళా స్టేషన్‌ డీఎస్పీగా బాలస్వామిరెడ్డి

కడప మహిళా స్టేషన్‌ డీఎస్పీగా బాలస్వామిరెడ్డి2
2/2

కడప మహిళా స్టేషన్‌ డీఎస్పీగా బాలస్వామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement