యాదగిరిగుట్ట రూరల్ : పర్యావరణాన్ని పరిరక్షణే ధ్యేయంగా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్యస్వామి కృషి చేస్తున్నారు. ప్రతి ఏటా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత పదేళ్లుగా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, ఆలేరు, రాజాపేట మండలాలతో పాటు కొలనుపాక, రాఘవపురం, తూర్పుగూడెం, భువనగిరి ప్రాంతాల్లో ఏటా 1,500 మట్టి విగ్రహాలను సొంత ఖర్చులతో పంచుతున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కళాకారులను రప్పించి, తన స్వగృహంలోనే ఎలాంటి రసాయనాలు, కృత్రిమ రంగులు వాడకుండా ఈ మట్టి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. గతంలో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో కూడా అంజయ్యస్వామి ఈ మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు.


