చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో హైదరాబాద్– విజయవాడ హైవేపై పండుగ రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి చౌటుప్పల్‌కు వచ్చేందుకు సాధారణ సమయాలతో పోలిస్తే శనివారం గంట అదనపు సమయం పట్టింది. తూప్రాన్‌పేట, ధర్మోజిగూడెం, చౌటుప్పల్ ప్రాంతాల్లో అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో విజయవాడ మార్గం పూర్తిగా ట్రాఫిక్ మయంగా మారింది. ఇదిలా ఉండగా.. లక్కారం శివారులో హైదరాబాద్ వైపు వెళ్తున్న రాజస్తాన్‌కు చెందిన కెమికల్ ట్యాంకర్ ఎయిల్‌లాక్ అయి ఆగిపోయింది. మరికొద్ది సేపటికే అటుగా వెళ్తున్న డీసీఎం ఇంజిన్‌లో పొగలు రావడంతో నడిరోడ్డులో ఆగిపోయింది. ఒకే చోట రెండు వాహనాలు ఆగడంతో వెనుక వైపు నుంచి వచ్చే వాహనాలు బారులుదీరాయి.


