నల్లగొండ : అన్నెపర్తిలోని 12వ బెటాలియన్ కమాండెంట్ బి.రామకృష్ణ శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి మొక్కను అందజేశారు. పోలీసు సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న డీఏలు, టీఏలు, సరెండర్ లీవ్‌ల బకాయిలను అతి త్వరలోనే క్లియర్ చేయనున్నట్లు మంత్రి ఆయనకు హామీ ఇచ్చారు.
ఉపేందర్‌కు సేవా రత్న అవార్డు
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జి.సి.ఎస్.వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ లిబరేషన్ డే అవార్డుల కార్యక్రమంలో అడవిదేవులపల్లి మండలం చిట్యాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగవెల్లి ఉపేందర్ ‘మౌలానా అబుల్ కలాం సేవా రత్న’అవార్డు అందుకున్నారు. కరోనా కాలంలో పేదలు, కులవృత్తుల వారికి నిత్యావసర సరుకులు అందజేయడం లాంటి సామాజిక కార్యక్రమాలు చేసినందుకు ఉపేందర్ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ కోదండరామ్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, మాజీ మంత్రి బాబుమోహన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.


