మళ్లీ అవకాశం వచ్చింది | - | Sakshi
Sakshi News home page

మళ్లీ అవకాశం వచ్చింది

Sep 12 2026 12:42 AM | Updated on Sep 12 2026 12:42 AM

మళ్లీ అవకాశం వచ్చింది ఏడాదిగా పట్టుదలతో చదువుతున్నా మెయిన్స్‌ కోసం ప్రత్యేక ప్రణాళిక షార్ట్‌కట్‌ మెథడ్స్‌తో సమయం ఆదా ఆన్‌లైన్‌ కోచింగ్‌తో ఆల్‌ రౌండ్‌ ప్రిపరేషన్‌ ఫిజికల్‌ ఈవెంట్సే కీలకం

గతంలో నాలుగు సార్లు పోలీసు పరీక్షలు రాశాను. ప్రతిసారీ మెయిన్స్‌లో కొద్దిపాటి మార్కులతో ఉద్యోగం చేజారింది. ప్రభుత్వం వయోపరిమితి పెంచడంతో నాకు ఇది ఐదో అవకాశం లభించింది. లేకపోతే నా వయస్సు దాటిపోయేది. ఈసారి ఎలాగైనా ఖాకీ చొక్కా తొడగాలనే పట్టుదలతో చదువుతున్నాను. – సింగారపు జానయ్య

ఇంతకుముందు ఒకసారి పరీక్ష రాసినా సెలెక్ట్‌ కాలేకపోయాను. దాంతో విసిగిపోకుండా గత ఏడాది కాలంగా తీవ్రంగా శ్రమిస్తున్నాను. లోపాలను సరిదిద్దుకుంటూ ఈసారి కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. – సంపంగి శివ

గతంలో ప్రిలిమ్స్‌, ఫిజికల్‌ ఈవెంట్లలో క్వాలిఫై అయినా మెయిన్స్‌ పరీక్షలో తడబడ్డాను. ఈసారి మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు సాధించేందుకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక షెడ్యూల్‌ వేసుకుని చదువుతున్నాను. – రిషిత

గత ఐదేళ్లుగా వివిధ కాంపిటేటీవ్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాను. పోలీసు మెయిన్స్‌లో మ్యాథ్స్‌ విభాగం కీలకం కాబట్టి, ఆన్‌లైన్‌ కోచింగ్‌ ద్వారా క్లిష్టమైన లెక్కలను తక్కువ సమయంలో చేసే షార్ట్‌కట్‌ పద్ధతులు నేర్చుకున్నాను. – అన్షూ

ఇది నాకు రెండో ప్రయత్నం. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ప్రతిరోజూ వచ్చి సొంతంగా నోట్స్‌ తయారు చేసుకుంటున్నాను. మెయిన్స్‌లో మంచి స్కోర్‌ సాధించడానికి ఆన్‌లైన్‌ కోచింగ్‌ క్లాసులు కూడా ఉపయోగించుకుంటున్నాను. – హరీష్‌

బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతూనే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాను. రాతపరీక్షకు సొంతంగా ప్రిపేర్‌ అవుతూ, రోజువారీ ఫిజికల్‌ ప్రాక్టీస్‌ కోసం క్రమం తప్పకుండా గ్రౌండ్‌కు వస్తున్నాను. – వాత్సల్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement