భువనగిరి: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. బుధవారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నీట్ నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జి చేయడం అమానుషం అని అన్నారు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించే అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.డి. ఇమ్రాన్, కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చంద్రయ్య, రాష్ట్ర సమితిసభ్యులు గోద శ్రీరాములు, శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, జంగమ్మ , గాలయ్య, వెంకటేష్, శేఖర్‌రెడ్డి, హరిశ్చంద్ర, ఏశాల అశోక్, మహేందర్, మాణిక్యం పాల్గొన్నారు.


