ఆత్మకూరు(ఎం): సుమారు 13 ఏళ్ల తర్వాత చేనేత పారిశ్రామిక సహకార సంఘాలకు నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. కానీ, ఏళ్ల తరబడి తిష్టవేసిన సమస్యలు ఆ సంఘాల నూతన అధ్యక్షులకు సవాల్‌గా మారాయి. కూర్చుందామంటే సొంత భవనాలు లేవు. అద్దెలు చెల్లించలేక, నెత్తిమీద లక్షల్లో రుణాల భారంతో పాలక వర్గాలు సతమతమవుతున్నాయి.
బాధ్యతలు చేపట్టినా..
జిల్లా వ్యాప్తంగా 41 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 8,758 మంది సభ్యులు ఉన్నారు. 2013లో వీటికి ఎన్నికలు నిర్వహించగా.. 2018తో పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు. ఎట్టకేలకు ఈ నెల 10న ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. మొత్తం 41 సంఘాలకు గానూ 23 ఏకగ్రీవం కాగా, మిగతా 18 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్సాహంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్త కమిటీలకు ఇప్పుడు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
సొంత భవనాలు కరువు..
సుమారు 20 సంఘాలకు సొంత భవనాలు లేవు. దీంతో అద్దె గదుల్లో కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. గతంలో సంఘాలకు అందజేసిన క్యాష్ క్రెడిట్ వడ్డీలతో కలిపి లక్షల్లో పేరుకుపోయింది. ఇది కొత్త అధ్యక్షులకు తలనొప్పిగా మారింది.జిల్లా వ్యాప్తంగా చేనేత సంఘాలకు స్థలాలను కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని, పేరుకుపోయిన క్యాష్ క్రెడిట్ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని అధ్యక్షులు కోరుతున్నారు.
ఫ చేనేత సహకార సంఘాలకు సొంత భవనాలు కరువు..
ఫ కూర్చునేందుకు కుర్చీ లేదు
ఫ రూ. లక్షల్లో పేరుకుపోయిన
క్యాష్ క్రెడిట్ భారం
ఫ 13 ఏళ్ల తర్వాత కొలువుదీరిన
కొత్త పాలక వర్గాలు


