రామన్నపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 91 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ తరగతులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించి, ఇన్‌స్ట్రక్టర్లను నియమించింది.
గతంలో అలంకారప్రాయంగా..
గతంలో ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు పాఠశాలలకు కంప్యూటర్లను సమకూర్చాయి. కానీ, వాటిని విద్యార్థులకు నేర్పించే బోధకులు లేకపోవడంతో ఆయా కంప్యూటర్లు అలంకారప్రాయంగా మూలనపడ్డాయి. ఈ సమస్యను అధిగమించేందుకు 2026–27 విద్యా సంవత్సరంలో ప్రత్యేకంగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించి కంప్యూటర్ పాఠాలు బోధించేందుకు శ్రీకారం చుట్టారు.
జిల్లాలో 91 పాఠశాలలుఎంపిక
కంప్యూటర్ తరగతుల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 91 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆరు గురుకులాలు, 11 కేజీబీవీలు, 18 పీఎం శ్రీ,, 46 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఏడు మోడల్ స్కూళ్లల్లో 2026–27 విద్యాసంవత్సరంలో కంప్యూటర్ తరగతుల నిర్వహించనున్నారు. ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను బోధించుటకు అవసరమైన బోధకులను నియమించి నిర్వహించే బాధ్యతను యాప్‌జోన్ అనే ఏజెన్సీకి అప్పగించారు. రెండు పాఠశాలలకు కలిపి ఒక ఇన్‌స్ట్రక్టర్‌ను నియమిస్తారు. వారంలో మూడు రోజులు ఒక పాఠశాలలో మిగిలిన మూడు రోజులు మరోచోట కంప్యూటర్ పాఠాలు బోధిస్తారు. అలాగే ఏఐని కూడా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఫ ఏఐ విద్యకూ కార్యాచరణ
ఫ జిల్లాలో 91 పాఠశాలలు ఎంపిక
ఫ ఏజెన్సీ ద్వారా ఇన్‌స్ట్రక్టర్ల నియామకం


