చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ పరిధిలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్ కావడంతో ఇరువైపులా వాహనాలు బారులుదీరాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ రద్దీ కొనసాగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామ శివారులోని తంగేడువనం పార్కు నుంచి పట్టణంలోని వలిగొండ క్రాస్‌రోడ్డు వరకు మూడున్నర కిలోమీటర్ల దూరం వాహనాలు నిదానంగా కదిలాయి. ఓ వైపున అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండడం, మరోవైపున వాహనాల రద్దీ నెలకొనడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


