పారిశుద్ధ్య కార్మికులకు ‘సఫాయి సురక్ష’ భరోసా | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికులకు ‘సఫాయి సురక్ష’ భరోసా

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

దేవరకొండ : పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రతిరోజూ పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యే కార్మికుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సఫాయి సురక్ష పథకానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దేవరకొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్మికుల ఆరోగ్య ప్రొఫైల్‌ నమోదు చేయడంతో పాటు వారి సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు

ప్రతిరోజూ పట్టణంలో పోగయ్యే చెత్తను సేకరిస్తూ, మురుగు కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తూ నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారించేందుకు శ్రీసఫాయి సురక్షశ్రీ ద్వారా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్మికులందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులను పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వర్తింపు

మున్సిపాలిటీలోని శానిటేషన్‌ విభాగం అధికారులు ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా వారికి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు సక్రమంగా వర్తించేలా ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నారు. సేకరించిన ఆరోగ్య వివరాలను మున్సిపల్‌ రికార్డుల్లో నిక్షిప్తం చేస్తున్నారు.

ఆరోగ్య పరిరక్షణ కిట్ల అందజేత

మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు గతంలో ఏటా ప్రభుత్వ పరంగా రక్షణ కిట్లను అందజేసేవారు. అయితే గత కొంతకాలంగా వీటి పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో కార్మికులు పనుల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సఫాయి సురక్ష పథకం కింద కార్మికులందరికీ తప్పనిసరిగా చేతి గ్లౌజులు, బూట్లు, హెల్మెట్లతో కూడిన ప్రత్యేక రక్షణ కిట్లను పంపిణీ చేశారు.

ప్రతి ఆరు నెలలకోసారి ఉచిత

వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలయ్యేలా చర్యలు

రక్షణ కిట్ల అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement