గుండాల: ప్రతి గ్రామంలో ఆగస్టు 15 నాటికి రెండు ఫామ్ పాండ్స్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం గుండాల మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సర్పంచ్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో పని చేస్తూ ఇంటికి ఒక ఇంకుడు గుంత త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. జల సంరక్షణలో భాగంగా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూమిలోకి ఇంకే విధంగా చేయాలన్నారు. గ్రామాలలో వీబీజీ రాంజీకి రోజూ 60 మంది కూలీలు వచ్చే విధంగా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. జిల్లాలో తాగు నీటి కోసం రూ.230 కోట్లతో ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. తాగు నీటి సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో డీపీఓ కె.శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి ఎ.శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎస్.హరికృష్ణ, ఎంపీడీఓ చండీరాణి, ఎంపీఓ రవూఫ్‌అలీ, ఏఈలు దామోదర్, భావన, నర్సింహ, ఏపీఓ ఇమ్మాన్యుయేల్, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఎంఈఓ మన్నె అగ్గిరాములు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
గజ వాహన సేవ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గజ వాహన సేవను సంప్రదాయంగా నిర్వహించారు. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలం కారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
సినారె సాహిత్యం..
నైతిక విలువల దీపిక
రామగిరి (నల్లగొండ) : ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్యం నైతిక విలువలతో కూడుకున్నదని, సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ కౌండిన్య అన్నారు. బుధవారం నల్లగొండ ఎన్జీ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సినారె జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగానికి సినారె చేసిన సేవలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, తెలుగు శాఖాధిపతి వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు టంగుటూరు సైదులు, వాసా భూపాల్, అంజయ్య పాల్గొన్నారు.


