పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

Jul 30 2026 7:18 AM | Updated on Jul 30 2026 7:18 AM

మిర్యాలగూడ : బీసీ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులు దృష్టి పెట్టాలని బీసీ కమిషన్‌ సభ్యుడు తిరుమలగిరి సురేందర్‌ అన్నారు. బుధవారం మిర్యాలగూడలోని ఎన్‌ఎస్పీ అతిథి గృహంలో మున్సిపల్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన రూ.5 భోజన పథకం సక్రమంగా అమలు అవుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. బీసీల సంక్షేమానికి సంబందించిన వివిధ పథకాల అమలుపై సమగ్ర వివరాలు అడిగారు. మహిళా శక్తి క్యాంటిన్లలో ఎంతమంది బీసీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారని ప్రశ్నించారు. అంతకుముందు ఆయనకు ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌శర్మ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంజీవ్‌, సహాయ అధికారి ఇస్తేరా తదితరులు ఘన స్వాగతం పలికారు.

బీసీ కమిషన్‌ సభ్యుడు సురేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement