వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దు

Jul 17 2026 12:52 AM | Updated on Jul 17 2026 12:52 AM

మోత్కూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి హెచ్చరించారు. గురువారం మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి వైద్య సేవలు, పరిశుభ్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌ పేషెంట్‌ వార్డుల్లో బెడ్‌ షీట్లు సరిగ్గా లేక పోవడంతో సూపర్‌వైజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, బెడ్‌ షీట్లను ఎప్పటికప్పుడు మార్చాలని ఆదేశించారు.బెడ్‌ షీట్లు అపరిశుభ్రంగా ఉంటే రోగులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు ఎలా వస్తారని వైద్యులు, సిబ్బందిని ప్రశ్నించారు. రోజూ ఔట్‌పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు? వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారా?, ఏయే మందులు ఇస్తున్నారు? వివరాలన్నీ ఆరోగ్యయాప్‌లో నమోదు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కాన్పులు ఎన్ని అయ్యాయో ఆరా తీశారు.ట్యాంకు వద్ద వృథాగా నీరు నిలిచిఉండడంతో వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌ నర్సయ్యకు ఫోన్‌ చేసి ట్యాంకును, ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పి.జ్యోతి, ఎంపీడీఓ బాలాజీ, డాక్టర్‌ నిరోష, సూపర్‌వైజర్‌ ఊర్మిళ, స్టాఫ్‌ నర్సు స్వాతి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ జనార్దన్‌ ఉన్నారు.

ప్రత్యామ్నాయ పంటల

సాగుపై అవగాహన కల్పిస్తున్నాం

సాక్షి, యాదాద్రి : జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు గురువారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వాతావరణ మార్పులు, పంటల సాగు, విద్యారంగ అభివృద్ధి, తాగునీరు, ప్రజారోగ్యం అంశాలపై నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌, డీఈఓ భిక్షపతి, డీపీఓ శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ఫ మోత్కూరు పీహెచ్‌సీ తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement